Sunday 16 August 2015

పరిశుభ్రతే దైవత్వం

తల్లి పూజ చేస్తూ ఉంటుంది. పక్కన కూర్చున్న పిల్లాడు ‘ఒకటో, రెండో’ చేస్తాడు.
ఒక్క ఉదుటన లేచి పిల్లవాడిని చక్కగా శుభ్రం చేసి,
మళ్లీ హాయిగా పూజ మొదలు పెడుతుంది.
అయ్యయ్యో పూజా మందిరం అవిపత్రమైపోయిందని ఆ తల్లి బాధపడదు.
పిల్లవాడిని త్వరగా శుభ్రపర్చాలని ఆదుర్దా పడుతుంది.
ఈ ఆదుర్దాను, ఆరాటాన్ని భగవంతుడు తనకున్న పది(?) చేతులతో
పవిత్రంగా అందుకుని ఆ తల్లిని ఆశీర్వదిస్తాడు.
పవిత్రత అనేది మనిషి పరిధిలో ఉన్న అంశం కాదు. (గుర్తించండి)
కేవం పరిశుభ్రత అనేది ఒక్కటే మన విషయం. (మర్చిపోకండి)
'పరిశుభ్రత' కోసం మనం పడిన శ్రమను, చేసిన కృషిని
భగవంతుడు 'పవిత్రం'గా గౌరవిస్తాడు.
మనిషికి.. పవిత్రతకు ఎలాంటి సంబంధం లేదు.
ఎందుకంటే మనసా వాచా కర్మణా అనుక్షణం పవిత్రంగా ఉండగల
సామర్థ్యం మనిషికి సహజంగా ఉండదు. అది ప్రకృతి నియమం.
అందుకే ప్రకృతిలో పరిశుభ్రతకు మించిన దైవత్వం లేదు.
ఈ సూత్రానికి తొలి గురువు అమ్మే.
ఆ గురువు మనకు నేర్పేదే పరిశుభ్రత, దానికి సమానమైన సహనశీలత.
నిజానికి పూజా మందిరం అపవిత్రతకి గురవదు. అపరిశుభ్రతకు లోనవుతుంది.
అప్పుడు మనం అమ్మని గుర్తుకు తెచ్చుకుని, గౌరవించుకుని శుభ్రపరుచు కోవాలి.

a muslim man takes care of both shiva temple and masjid


http://www.kannadaprabha.com/nation/a-muslim-man-takes-care-of-both-shiva-temple-and-masjid/256915.html#.Vc2gkg6mHPI.facebook